Monday, December 23, 2024

చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత కేసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: చెరువులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మండల పరిధిలోని లక్నాపూర్, మిట్టకోడూ ర్, ఇబ్రాహింపూర్, గడిసింగాపూర్, రంగంపల్లి, తదితర గ్రామాలలో ఊరూర చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మిట్టకోడూర్ చెరువు, లక్నాపూర్ ప్రాజెక్ట్‌లలో పాల్గొని సంబురాలను వీక్షీంచారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు గ్రామాలలో చెరువులకు అధిక నిధులు మంజూరు చేసి పూడుకపోయిన చెరువులకు జీవం పోసి వాటిని తిరిగి పూడిక తీయించి పూర్వ వైభవం తీసుకవచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నా రు. అంతుకు రైతులు, మహిళలు, యువత కూలీలు అనందంగా ఉన్నారని గుర్తు చేశారు. చెరువుల కింద వేల ఎకరాలలో సాగు అవుతుందని రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఆయా గ్రామలలో బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపూ నిర్వహించి బోతరాజుల విన్యాసాలు, కోలటాలు నృత్యాలతో చెరువు కట్టలపైకి వెళ్లి అక్కడ ఆటపాటలు ఆడారు.

చెరువులో ప్రత్యేక పూజలు చేసి కట్టమైసమ్మ తల్లికి పూజలు చేశారు. చెరువులలో బతుకమ్మలను వదిలిపెట్టారు, చెరువుల కట్టలపై సహాపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, మిట్టకొడూర్‌లో డిపిఓ తరుణ్‌కుమార్, ప్రత్యేకాధికారి దీపారెడ్డి, ఎంపిడిఓ శేషగిరి శర్మ, ఆర్‌డబ్లు ఎస్ డిఈ సుబ్రమణ్యం, ఏఎంసీ చైర్మన్ సురేందర్, సర్పంచ్ పటేల్ జయలక్ష్మీ జగదీశ్వర్, కార్యదర్శి బిచ్చన్న, మల్లేశ్, ఇబ్రహీంపూర్‌లో సర్పంచ్ కమ్మరి నర్సమ్మ, ఏఓ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు బిచ్చయ్య, నందిత, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ముజాఫర్, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News