Friday, November 15, 2024

ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరు అందించిన ఘనత కేసీఆర్‌దే

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేసి తాగు నీటి కష్టాలు తొలగించారని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం పానగల్లు తాగు నీటి శుద్దీకరణ కేంద్రంలో మంచినీళ్ల పండుగ.

కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎండా కాలంలో తాగు నీళ్లు,పశువులకు తాగు నీరు దొరకడం కష్టంగా ఉండేదని,4,5 రోజుల కొకసారి తాగు నీరు సరఫరా జరిగేదని అన్నారు.పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమాజం లో అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ వడివడిగా అడుగులు వేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.. గతంలో కరెంటు ఉండకపోయేది.

కరెంటు ఉన్న లోవోల్టేజీ కారణంగా బోర్లు కాలిపోయాయని ఆయన తెలిపారు. కరెంటు వల్లనే ఇవన్నీ సాధ్యమని గ్రహించి 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండవ సంవత్సరం నుండి 24 గంటల కరెంటు సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. పక్కన పానగల్ రిజర్వాయర్ ఉన్న పానగల్ వాసులకు మంచినీరు అందించలేకపోయారన్నారు. 43791 కోట్ల రూపాయలు నీటికి ఖర్చుచేసి మిషన్ భగీరథ ను ప్రారంభించి, ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ది చేసిన నీటిని రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీటిని ఇంటింటికి అందిస్తున్నాం అని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా అందించే శుద్ది చేసిన తాగు నీటిని త్రాగండి.. కృష్ణా నీరే ముద్దు.మినరల్స్‌తో కూడిన క్రిష్ణా నీరు అమృతం లాంటిదని,మిషన్ భగీరథ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రజలకు పిలుపునిచ్చారు.

మిషన్ అధికారులు ప్రజలు మెచ్చుకునేలా పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు.మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే తాగు నీటిని బాత్ రూం లు,డ్రైనేజీ కడగడానికి వృధా చేస్తూ క్యాన్ వాటర్ కొనుక్కొని త్రాగు తున్నారని,మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివని అధికారులు ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 2014 ముందు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఉండేది అన్నారు. ఫ్లోరోసిస్ బారిన పడి ప్రజలు అంగవైకల్యం, అనారోగ్యాల బారిన పడ్డారని ఆయన ఆనాటి సంఘటన గుర్తు చేశారు.

2014 తెలంగాణ ఏర్పడ్డాక మిషన్ భగీరథ వచ్చినాక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఉదయ సముద్రం నీటిలోని మట్టి, ఇసుక జీవం లేని వాటిని జీవమున్న బ్యాక్టీరియాలను తొలగిస్తున్నాం అన్నారు. అందుకు ఆలం వేసి తర్వాత క్లోరినేషన్ పూర్తి అయినాక 565 కిలోమీటర్ల వరకు ఓ .హెచ్.అర్ కు పైపు లై న్ల ద్వారా నీరు పంపిస్తున్నామని తెలిపారు. గతంలో గ్రౌండ్ వాటర్ ను బోర్ల నుండి నీటిని తీసి ఉపయోగించే వారమని తెలిపారు. నేడు మిషన్ భగీరథ శుద్దీకరణ కేంద్రం లోకి పంపి అక్కడ ఆలం ద్వారా వ్యర్థాలను తొలగించి క్లోరినేషన్ చేసి పైపులైన్ల ద్వారా ఇంటింటికి శుద్ది చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు.శుద్ది చేసిన మంచినీటిని అందించడం ద్వారా రోగాల సంఖ్యను కూడా తగ్గించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మిషన్ భగీరథ డి. ఈ. రామ కృష్ణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంపీపీ కరీం పాషా, జడ్పిటిసి చెట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి,మిషన్ భగీరథ సి. ఈ .మధు బాబు, ఈ.ఈ.లు వంశీ కృష్ణ, యాదయ్యలు,డి.ఈ.నర్సింహ,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య, స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు,డి.పి.అర్. ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News