Wednesday, January 22, 2025

దేశంలో ఏ సిఎం చేయని అభివృద్ధి కెసిఆర్ చేస్తున్నారు : అక్బరుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నారని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి ప్రశంసించారు. పాతబస్తీలోని బండ్లగూడలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని, తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ప్రజలకు పని కొచ్చే అబివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతనే తనను విమర్శించాలని సలహానిచ్చారు. కొంత మంది కేవలం విమర్శలకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసే నాయకుడిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తనపై దాడి అంశంపై అక్బరుద్దీన్ స్పందిస్తూ నిందితులను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పారు. ఈ సందర్భంగా తన కూతురి గురించి అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తన కూతురు ప్రజా సేవ కోసం ప్రజల మధ్యకు రాబోతుందని చెప్పారు. తన కూతుర ప్రస్తుతం విదేశాల్లో బారిస్టర్ (లా) చదువుతోందని, చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News