Monday, December 23, 2024

కెసిఆర్ గొప్ప సెక్యులర్, తెలంగాణలో శ్రేయోరాజ్యం

- Advertisement -
- Advertisement -

మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ
మొహర్రం ఏర్పాట్లపై సమీక్ష

KCR is great secular in Telangana

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప లౌకికవాది అని, తెలంగాణ ప్రజలందరిని కంటికి రెప్పలా చూసుకుంటూ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ చెప్పారు. ఆగష్టు 8,9 తేదీలలో జరిగే మొహర్రం పండుగ, ఊరేగింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ముందస్తు సమావేశం శనివారం మాసాబ్‌ట్యాంక్ లోని సంక్షేమ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మైనారిటిలతో పాటు ప్రజలందరి భద్రత, సంక్షేమం, ఉన్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానమైన అన్ని పండుగలు, జాతరలు, ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శ్రేయోరాజ్యం కొనసాగుతోందని ప్రజలందరు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. మొహర్రం పండుగ, ఊరేగింపు సందర్భంగా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు దిశా నిర్దేశం చేశారు.

ఆషుర్ ఖానాలకు అవసరమైన మరమ్మత్తులు యుద్దప్రాతిపదికన చేపట్టాలని, ఆ చుట్టుపక్కల చెత్తా చెదారం, గుంటలు లేకుండా చక్కగా తీర్చిదిద్దాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. శాంతిభధ్రతల సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ జాంలకు అవకాశం ఇవ్వకుండా, తాగునీటి కొరత రాకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News