Monday, December 23, 2024

తెలుగుదనానికి కెసిఆర్ ఆదర్శవంతులు: బుద్ద ప్రసాద్

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రే సాహిత్య అద్యయన పరుడు కావటం వల్ల తెలంగాణ సాహిత్య అకాడమికి ఎనలేని ప్రోత్సాహాం లభిస్తోందని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధికారభాషా సంఘం మాజీ అద్యక్షులు మండలి.బుద్ద ప్రసాద్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక కవి, రచయిత అవ్వడం వల్ల సాహిత్య అకాడమిని పునరుద్ధరించి, సమర్థులను అద్యక్షులుగా ఎన్నుకుని, తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారని, ఇది ఇతర రాష్ట్రాల నాయకులకు ఆదర్శవంతమని కొనియాడారు. శుక్రవారం రాష్ట్ర సాహిత్య అకాడమి కార్యాలయంలో, అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తో ఆయన భేటీ అయ్యారు. సాహిత్య అకాడమి కార్యాలయంలో తెలంగాణ తేజోమూర్తుల చిత్రాలను బుద్ద ప్రసాద్ తిలకించారు.

ఈ సందర్భంగా “పునాస” పత్రికలను ఆయనకు అందజేయటం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ., తెలంగాణ సాహితీమూర్తులూ, తెలుగు భాష కోసం కృషి చేసిన మహానీయుల చరిత్రలను పుస్తకాలుగా వెలువరించటం అభినందనీయమన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమిను చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దేశంలో 100శాతం అక్షరాస్యుల రాష్ట్రమైన కేరళ సాహిత్య అకాడమి పురోగతిలో ఉండేదని, ఇపుడు తెలంగాణ సాహిత్య అకాడమి కేరళతో పోటీ పడే స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన ఊరు మన చెట్టు వంటి కథల పోటీతో బాలసాహిత్యంపై తెలంగాణ సాహిత్య అకాడమి వేసిన ప్రోత్సాహక ముద్ర ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు.

5 లక్షల మంది విద్యార్థులు ఆపోటీలో పాల్గొనటం గొప్ప విషయమని, భావితరం విద్యార్థులను మూస ధోరణిలో పోనివ్వకుండా వారి జీవితాలపై మంచి ప్రభావం చూపుతుందని తెలిపారు. సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో వెలువరిస్తున్న “పునాస” పత్రికను రాష్ట్రంలోని అన్నీ స్కూళ్లకు, అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించేందుకు జరుగుతున్న కృషి మరో అద్భుతమన్నారు. తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మండలి బుద్దప్రసాద్ తమకు ఎంతో ఆప్తులని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన బుద్దప్రసాద్‌కు తెలుగు భాష, సాహిత్యంపై మక్కువ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో “రైతునేస్తం” సంపాదకుడు పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, తెలంగాణ గ్రామీణ విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్. కిషోర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News