Sunday, January 19, 2025

కెసిఆర్ కోలుకుంటున్నారు!

- Advertisement -
- Advertisement -

సంతోషం వ్యక్తం చేసిన ఎన్నారై బిఆర్‌ఎస్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. బాత్రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన గత కొన్ని వారాలుగా నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బిఆర్‌ఎస్ ఎన్నారై  కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి ఎన్నారైలు కెసిఆర్ ఫొటోస్ చూసి ఫోన్ చేశారు, కెసిఆర్ యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు, త్వరలోనే ఆయన మొత్తం కోలుకొని ప్రజాక్షేత్రములోకి రావాలని, పార్టీని మరింత బలోపేతం చెయ్యాలన్నారు. తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేని తెలంగాణని వూహించుకుపోలేకపోతున్నారన్నారు.

KCR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News