Saturday, December 21, 2024

అంతరించి పోతున్న కుల వృత్తులకు జీవం పోస్తున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • కుల వృత్తుల బలోపేతానికే ఆర్థ్ధిక సాయం
  • దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100 శాతం సబ్సిడీపై బీసి బంధు
  • కెసిఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం పూర్తయి మత్స సంపద పెరిగింది
  • స్వయం ఉపాధి కోసం ఇస్తున్న డబ్బులను వృథా చేయకండి
  • దశలవారీగా అర్హులందరికి బీసి బంధు
  • బిసి బంధు పథకం నిరంతర ప్రక్రియ
  • హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు సిద్దిపేట నుంచి లారీల కొద్ది చేపల ఎగుమతి
  • త్వరలో సిద్దిపేటకు బీసి గురుకుల డిగ్రీ కళాశాల
  • రాష్ట్ర, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: అంతరించిపోతున్న కులవృత్తులకు సిఎం కెసిఆర్ జీవం పోస్తున్నారని రాష్ట్ర, ఆర్థిక, వైద్యా రోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్‌లో 303 మందికి బీసి బంధు పథకం చెక్కులను ఆయన పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 100 శాతం సబ్సిడీపై బీసి బంధు కింద లక్ష రూపాయలను ఆర్ధిక సహాయంగా అందిస్తున్న ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్ధికంగా, అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే రజక, నాయీ బ్రహ్మణులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. స్వయం ఉపాధి కోసం ఇస్తున్న లక్ష రూపాయలను వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. బీసి బంధు పథకం కింద ఇస్తున్న సహాయం ఆరంభం మాత్రమేనని దశల వారీగా అర్హులైన వారికి లక్ష రూపాయలు ఇచ్చే నిరంతర ప్రక్రియ అన్నారు.

గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇచ్చిన సబ్సిడీపై ఇచ్చేవారని అదే సీఎం కేసీఆర్ వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నారన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఆఫీసుల చుట్టు తిరగకుండా పైరవీలు పట్టకుండానే లక్ష రూపాయలను అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రంలోని చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండు కుండల్లా ఉన్నాయన్నారు. అలాగే మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధ్దరణ చేపట్టడంతో మత్స సంపద గణనీయమంగా పెరిగిందన్నారు. ఒకప్పుడు సిద్దిపేటకు విజయవాడ, బెంగుళూర్‌లాంటి ప్రాంతాల నుండి చేపలను ఎగుమతి చేసుకునేవారమని ప్రస్తుతం సిద్దిపేట నుంచే హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు లారీల కొద్ది చేపలను ఎగుమతి చేస్తున్నామని అన్నారు. మూగ జీవాలకు ఒకప్పుడు నీరు దొరకని ప్రాంతాలలో గోదావరి జలాలు గలగల పారుతున్నాయన్నారు. మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు వాహనాలు, వలలు లాంటివి 100 శాతం సబ్సిడీతో అందించడంతో వారి జీవితాలలో కొత్త వెలుగులు వచ్చాయన్నారు.

అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఆనందంగా బతకాలన్నదే లక్షంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 గురుకులాలను సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టి ఉచితంగా నాణ్యమైన విద్యబోధనను అందిస్తున్నారన్నారు. అలాగే గురుకులాలలో జూనియర్, డిగ్రీ కళాశాలలు సైతం ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేటకు అతి త్వరలో డిగ్రీ బిసి గురుకుల కళాశాలను ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. గీతా కార్మికుల సొసైటీలను పునరుద్ధరించి అన్నివిధాలుగా అండగా నిలిచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌడ కులస్ధులకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్ కల్పించింది తెలంగాణలో మాత్రమే నన్నారు. చేనేత కార్మికులకు సైతం వృత్తి పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. అన్ని కులాలలో అర్హులైన వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధి పొంది ఆర్ధికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్షంగా పెట్టుకున్నారన్నారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించి అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్ సర్కార్‌కే ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటో రోజా రాధాకృష్ణ శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు ,నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కుంబాల ఎల్లారెడ్డి, కోల రమేశ్, ఎడ్ల సోమిరెడ్డి, వంగ ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరిగౌడ్, బాల్ రంగం, అల్లం ఎల్లం, మల్లయ్య, బాలమల్లు, హరీశ్, ప్రభాకర్ వర్మ, శ్రీనివాస్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News