Wednesday, January 22, 2025

కులవృత్తులు అంతరించిపోకుండా కాపాడుతున్న కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

ఉచిత చేప పిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద

కోడూరు చేప పిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: కుల వృత్తులు అంతరించిపోకుండా కాపాడుతూ వాటిని కాపాడడమే కాకుండా ఆ వృత్తుల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఉచిత చేప పిల్లల పంపిణీ విజయవంతంగా చేస్తున్నామని, ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగిందని తెలిపారు.

మహబుబ్ నగర్ రూరల్ మండలం కోడూరు చెరువులో 42 వేల ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు చెరువులు ఎండిపోయి కళా విహీనంగా ఉండేవని ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఉన్న 1086 చెరువులలో రూ.114.53 లక్షల నిధులతో 190.16 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంఛార్జ్ యం. సత్యనారాయణ, జిల్లా మత్స్య శాఖ ఆధికారి డి. రాధ రోహిణి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మల్లు నరసింహా రెడ్డి, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, యంపిటిసి రవీందర్ రెడ్డి, వైస్ యంపిపి అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, డిసిసిబి డైరెక్టర్ నర్సింహులు, మత్స్య శాఖ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News