Monday, December 23, 2024

కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఇటీవల మున్సిపాలిటి మంజూరైన ౩౦ కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డును పరిశీలించారు. అనంతరం 16వ వార్డు భాజపా అధ్యక్షులు మంచిగంటి హన్మంతరావు, గోరుగంటి రవీందర్‌రావులను గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో అన్ని వార్డులకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. సూర్యాపేట పట్టణ అభివృద్ధికి గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పటికే 1390 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అన్ని వార్డుల్లో అంతర్గత రహదారుల నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి పట్టణాభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంను అన్ని రంగాల్లో అభివృద్ధిపదంలో నడిపిస్తున్న బీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, రంగినేని ఉపేందర్‌రావు, కాసా శ్రీనివాస్, గుండపునేని కిరణ్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News