Wednesday, January 22, 2025

కెసిఆర్ సంక్షేమ పథకాల పితామహుడు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడు అని దేవరకొండ శాసనసభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఏపల్లి మండలానికి చెందిన 93మందికి రూ .9 3లక్షలు కల్యాణ లక్ష్మీ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు.పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుంది అని ఆయన అన్నారు.

తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం అని ఆ యన అన్నారు. కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చే సు కోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క ల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భ రోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కెసిఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సం క్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.

సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆ దుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు.కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలే దని…కేవలం బిఆర్‌ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం,కెసిఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.

ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని రవీంద్ర కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ వెల్లుగురి వల్లపు రెడ్డి, అర్వపల్లి నర్సింహ, తోటకురి పరమేష్, శీలం శేఖర్ రెడ్డి, దేపావత్ నరేందర్, రమావత్ చందు, మద్దిమడుగు కర్ణయ్య, గుండాల శ్రీనివాస్ యాదవ్, బొడ్డుపల్లి మహేందర్, బొడ్డుపల్లి కృష్ణ, అమరెందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News