Sunday, December 29, 2024

కెసిఆర్ మాటే శిరోధార్యం.. అధినేత ఆదేశమే అంతిమం

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి రూరల్: రానున్న శాసన సభ ఎన్నికల్లో అధినేత కెసిఆర్ మాటే శిరోధార్యంగా అధినేత ఆదేశమే అంతిమంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ 2023 శాసన సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు వంద స్థానాలలో గెలుస్తారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో రైతు సంక్షేమ పాలన కొనసాగుతుందని, 66 లక్షల రైతులకు రైతు బంధు వారి ఖాతాలో జమచేసారని, 35 వేల కోట్లతో రైతు రుణ మాఫీ చేశామని అన్నారు.

గిరిజన తండాల రోడ్లకు రూ.66.56 కోట్ల నిధులు మంజూరు

నియోజకవర్గంలో గిరిజన తండాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు 66.56 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించామని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధికి నోచుకోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

పదేళ్లలో వంద సంవత్సరాల అభివృద్ధి

వలస పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోక ఆగమైన తెలంగాణ రాష్ట్రం సాగునీటి గోస పడిందని ఎమ్మెల్యే అన్నారు. సిఎం కెసిఆర్ సారధ్యంలో స్వరాష్ట్రం సాధించుకున్నామని వందేళ్లలో జరుగని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపారని సిఎం కెసిఆర్ తెలంగాణ జాతిపిత అని అన్నారు.

పార్టీని నమ్ముకుని పనిచేస్తే పదవులు వస్తాయి

వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బిఆర్‌ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిబద్ధత గల నాయకులుగా సిఎం ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ సిద్ధాంతాన్ని పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అధినేత ఆదేశమే అంతిమంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీని నమ్ముకుని ఉండాలని, నమ్ముకుంటే పదవులు వస్తాయని అన్నారు. విభేదాలు విడుదామని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ పెద్దలు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామని అన్నారు. ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే మనల్ని మనమే అవమాన పరుచుకున్నట్లని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News