Friday, November 22, 2024

కుల వృత్తులలో పూర్వ వైభోగం వచ్చే విధంగా కృషి చేస్తున్న నాయకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

మల్దకల్: మండల కేంద్రంలో రైతు భవనం వేదికలో బీసీ కుల వృత్తుల వారికి రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్పలు హాజరయ్యారు. అనంతరం 55 మందికి రూ. లక్ష చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదని, బడుగు బలహీన వర్గాల బాధలు సాధకబాధకలు బలహీన వర్గాలు అభ్యున్నత కోసం అన్ని మతాలు అన్ని కులాలను గౌరవిస్తూ వారు కూడా ఆర్ధికంగా ఎదగాలని ఆహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ కులాలకు గౌరవిస్తూ వారి కుల వృత్తులను పూర్వవైభోగం వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మత్సకారులకు చాపలు మోటార్ వాహనాలు, పంపిణీ చేశారు.

చేనేత కార్మికులకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేసి చేనేత కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి చేనేత భీమా రూ. 5 లక్షలను ప్రభుత్వం తరపున అందించడం జరుగుతుంది.ప్రజలందరూ సీఎం కేసిఆర్‌ని ఎమ్మెల్యేని మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య , జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్‌గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, వెంకటేశ్వర్‌రెడ్డి, విష్ణు, యాకోబు, లక్ష్మన్న, నర్సిములు, హైదర్, వెంకట్రాములు, సీతారాంరెడ్డి, విక్రమ్, సింహారెడ్డి, చక్రంరెడ్డి, అజయ్, రామచంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, నారాయణ, మధునాయకి, ఆంజనేయులు, పరుశురాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News