Thursday, January 23, 2025

ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత సిఎం కెసిఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సంక్షేమ సంబురాలు కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధ్ది పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదన్నారు.

రైతులకు రైతుబంధు, రైతు భీమా , రైతు భరోసా వంటి పథకాల రూపంలో ఆర్థిక సాయం అందుతుందన్నారు. అలాగే దళితులకు దళిత బంధు అందజేస్తోందన్నారు. 2014 ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసింది సిఎం కెసిఆర్‌నే అన్నారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్షంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నేటి నుండి కుల వృత్తుల కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం సిఎం కెసిఆర్ ఇవాళ్ల ప్రారంభిస్తున్నారని తెలిపారు.

వెనుకబడిన సామాజిక వర్గాల్లోని చేతి వృత్తులు, కుల వృత్తులు నిర్వహించే మేదరి, కుమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రహ్మణుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీనిని ప్రతీ ఒకరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరిపెల్లి విజయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాం బాబు, బిఆర్‌ఎస్ నాయకులు,అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News