Sunday, December 22, 2024

పేదల బాంధవుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్: బీద బడుగు వర్గాల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తూ వారి బతుకు పై భరోసా కల్పిస్తున్నారని, పేదల గుండెల్లో నిలిచిపోయిన పేదల బాంధవుడు కెసిఆర్ అని మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకాన్ని ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో 55 మందికి లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల కాలంలోని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షలు విమర్శలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. జరుగుతున్న అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించేది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మడానికి సిద్ధ్దంగా లేరని రాబోయే ఎన్నికల్లో మూడవసారి బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, జెడ్పిటిసి శివరంజని ఆనంద్, వైస్ ఎంపీపీ కోటేష్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, రెండో అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్ రెడి,్డ వైఎస్‌ఆర్ మార్కట్ చైర్మన్ రాజు, కౌన్సిలరు,్ల టిఆర్‌ఎస్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News