నల్లగొండ:రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌మం డల ంలోని నోముల గ్రామానికి చెందిన ఆలగడప అలివేలుకు రూ.2లక్షల 50వేలు, నకిరేకల్ పట్టణంలోని 20వ వార్డుకు చెందిన బెజవాడ ని హారికకు 1లక్ష 50వేల రూపాయల ఎల్‌ఓసీ చె క్కులను గురువారం ఆయన బాధితులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించి మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇద్దరికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, రాచకొండ శ్రవణ్, రాచకొండ వెంకన్న, గుర్రం గణేష్, భీమనబోయిన లింగరాజు, ఆలకుంట్ల సైదులు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.