Friday, December 20, 2024

రైతే రాజు నినాదాన్ని సార్థకత చేసింది కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం అనేక సంక్షేమ పథకాలను రైతే రాజు అనే నినాదాన్ని సార్థకత చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే నని కరీంనగర్ నగర బిఆర్‌ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువుతో ఆనాడు పల్లెల్లో వలసలు వెళ్ళారు..ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఉపాధి కోసం వస్తున్నారని పేర్కొన్నారు.

ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఎందుకన్న పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు రైతుబంధు, బీమా కూడా రైతులకు వద్దంటారని , ఇది తెలంగాణ రైతంగం కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చేప్పాలని కోరారు. రాష్ట్రంలో పాత పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలను శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా కేంద్రం చేత నామకరణం చేయబడ్డాయని అన్నారు.

సాగునీరు, కరంటు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి కరువుకు నిలయంగా, వలసలకు మారుపేరుగా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సమాజాన్ని కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనే దానికి సమాధానం మొత్తం దేశం యాసంగిలో ఎంత వరి పండిస్తుందో అంతకు ఎక్కువగా తెలంగాణ వరి పండించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని తెలిపారు.

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను రైతాంగం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత కండ్ల మంట ఉందో ఆయన మాటలను బట్టి అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్,టీడీపీ ల పాలనలో కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే నని అన్నారు.

తెలంగాణలో రైతన్న కు ఇచ్చే ఉచిత విద్యుత్ తొలగిస్తామని రేవంత్ రెడ్డి వాఖ్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రెండున్నర కోట్ల జనాభా రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నదని తెలిపారు.24 గంటల కరంటు మూలంగా రైతు తన అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గడ్డం ప్రశాంత్ రెడ్డి, దీకొండ కుల్ దీప్ వర్మ , సాయి కృష్ణ, మీర్ షౌకత్ అలీ , వాజిద్ ,చంద్రశేఖర్ ,మెరుగు శ్రీనివాస్, సత్తినేని శ్రీనివాస్, ఓడ్నాల రాజు, నారదాసు వసంతరావు, అప్రోజ్ ఖాన్, గందె కల్పన, కర్రె పావని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News