దశాబ్దాలుగా వెనుకబడి వున్న తెలంగాణను పంజాబ్, హర్యానాలకు దీటైన ధాన్యాగారంగాను, వరి ఉత్పత్తిలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు అందించుటలో భారతాగ్రరాష్ట్రంగాను, తలసరి విద్యుత్ వాడకంలోనూ అగ్ర రాష్ట్రంగా, తలసరి ఆదాయ సాధనలో దేశంలో 4వ రాష్ట్రంగాను, పారిశుధ్య పాలనా రంగాలలో పలు జాతీయ అవార్డులు సాధించిన రాష్ట్రంగా, అద్భుత కళాక్షేత్రంగా, ఆధ్యాత్మిక కళాక్షేత్రం యాదాద్రిని కలిగిన రాష్ట్రంగా విలసిల్లుతున్నది తెలంగాణ. అందుకే నేడు ఆసేతు హిమాచల పర్యంతం భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నది తెలంగాణ. దటీజ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. విశ్వసనీయంగా వ్యవసాయం చేసే ఎద్దును వదులుకోరు రైతులు. మరి ఇంతటి జ్ఞానిని, రాజనీతిజ్ఞుని, దార్శనికుని, ప్రగతి సాధకుని, తమ ముద్దుబిడ్డను, తెలంగాణ పిత కెసిఆర్ నాయకత్వాన్ని వదులుకుంటారా తెలంగాణ ప్రజలు?
బిజెపి ఎన్నికల దరువేస్తున్నా, కాంగ్రెస్ గ్యారెంటీల చిందేస్తున్నా, తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున బిఆర్‌ఎస్ వెంటే కదం తొక్కుతున్నారు. ఎందుకు తాతా? ఎందుకంటే? ‘భారత దేశం జాతిపిత గాంధీ’, ‘ఆంధ్రప్రదేశ్ అమరజీవి పొట్టి శ్రీరాములు’, ‘తెలంగాణ కెసిఆర్‌ల బంధం అజరామరం! అయితే స్వతంత్ర భారతాన్ని కన్న తండ్రి గాంధీని, దాని ఎదుగుదలను చూడకుండానే మతోన్మాది గాడ్సే పొట్టన బెట్టుకొన్నాడు! ఆంధ్రప్రదేశ్ శిశువును చూచుకోకుండానే అమరులయ్యారు పొట్టి శ్రీరాములు.కాని చావు అంచుల దాకా వెళ్ళి ‘తెలంగాణ’ను ప్రసవించటమే గాక, నవ వసంతాలుగా తన జ్ఞాన, విజ్ఞానాలతో నిర్విరామంగా పరిశ్రమిస్తూ భారతాగ్ర రాష్ట్రాలలో ఒక్కటిగా ఎక్కదీసిన దార్శనికుడు కెసిఆర్!
అందువలన ‘తెలంగాణ కెసిఆర్‌ల బంధం అజరామరమైనదేగాక, ‘కన్ను చెయ్యి’ బంధంలా ఆత్మీయ బంధం కూడా! “తెలంగాణ కంటి’ వెంట చిన్న కన్నీటి బొట్టు జాలువారినా వెంటనే ‘కెసిఆర్ అను చెయ్యి’ తుడిచేసి నేనున్నానంటూ భరోసా నిస్తుంది!” అలాగే ‘కెసిఆర్ అను చేతికి’ చిన్న గాయమైనా శోకిస్తుంది ‘తెలంగాణ కన్ను’!” ఉదా॥ ఇటీవల కెసిఆర్ వైరల్ ఫీవర్‌కు గురయ్యారన్న వార్త వినగానే తెలంగాణ ప్రజలు కొందరు కుల, మతాతీతంగా ‘మా కెసిఆర్‌కు పూర్ణ ఆయుఆరోగ్యాలను ప్రసాదించమంటూ ‘ఈశ్వర్ అల్లాహ్ యెహోవాదులను స్వచ్ఛందంగా ప్రార్థించడమే అందుకు నిదర్శనం!
తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కాదు, సమస్యల నుండి గట్టెక్కించి తెలంగాణను ప్రగతి పథాన పరుగెత్తించ గల జ్ఞాన సిద్ధిని పొందిన దార్శనికుడు కెసిఆర్! ఉద్యమ సమయంలో ‘విడిపోతే విద్యుత్ కోతలతో తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలు మూతపడతయ్! వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలతో ప్రజలు వలస పోతారు.
ప్రత్యేక తెలంగాణ విఫల ప్రయోగమవుతుందని శాపనార్థాలు పెట్టారు! అలా జరగాలని వేయి కళ్ళతో ఎదురు చూశారు ప్రత్యర్థులు! వాళ్ళూహించిన సంక్షోభాలన్నీ చుట్టుముట్టినయ్ తెలంగాణ శిశువును. అయినా చలించలేదు కెసిఆర్! ‘గాలికి ఊగుతున్న కొమ్మ మీద కూడా నిబ్బరంగా వుంటుంది పక్షి! ఎందుకంటే, అది కొమ్మను కాదు, తన రెక్కల్ని నమ్ముకున్నది!” అలాగే కెసిఆర్ తన జ్ఞానశక్తిని నమ్ముకున్నాడు. ‘జ్ఞానాన్ని మించిన శక్తి లేదు!’ అంటున్నది భగవద్గీత! అందువల్లనే ఆ సంక్షోభాల సుడిగుండం నుండి తెలంగాణను గట్టెక్కించేందుకు నిబ్బరంగా ఆలోచించాడు కెసిఆర్!
తక్షణం 1) పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొన్నాడు, స్వయంగా విద్యుదుత్పత్తిని పెంచే చర్యలు చేపట్టారు. 2) కాకతీయుల నాటి చెరువులను, కాలువలను పునరుద్ధరించారు 3) పలు రిజర్వాయర్లు నిర్మించారు. 4) కాళేశ్వరం, పాలమూరు వంటి భారీ ఎత్తిపోతల పథకాలను 5) ఇంటింటికి వీధి వీధినా ఇంకుడు గుంతలను నిర్మింప చేశారు.
సత్సంకల్పునకు దైవ సహాయం తోడవుతుందని నిరూపించాడు వరుణుడు! తెప్పలుగ చెరువులు, రిజర్వాయర్లు నిండినయ్! వ్యవసాయానికీ నిరంతర విద్యుత్‌నందించారు. దాంతో ఏళ్ళ తరబడి చతికిలబడ్డ బోర్లన్నీ ఒక్క ఉదుటున లేచి నీళ్ళను పరుగెత్తించినయ్! ‘పంట కాలువల గలగలలు, పైరులు, పండ్ల తోటల జలజలలతో నేడు సంగీతాలాపన చేస్తున్నది ‘తెలంగాణ వీణ’ కెసిఆర్ దార్శనికతకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? అందుకే “మా కెసిఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు”! అంటూ సగర్వంగా చెప్పుకొంటున్నారు తెలంగాణ రైతులు! దటీజ్ కెసిఆర్!
అంతేకాదు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదోక్త సనాతన ధర్మాన్ని పాటించారు కెసిఆర్! ‘తెలంగాణ’ వర్షాభావానికి, కరువు కాటకాలకు గురికాకుండా సుభిక్షంగా వుండేందుకు 22% కి పతనమైన అడవులను తిరిగి 33 శాతానికి పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. 1) అడవుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కలు, వగైరాలను నాటించారు. 2) రోడ్ల పక్కన, ఇళ్ళు, కార్యాలయాల చుట్టూ పార్కుల నిండా కోట్లాది మొక్కల్ని నాటించారు. హరితహారం గ్రీన్ ఛాలెంజ్ గ్రామ గ్రామాన నర్సరీల పెంకం మొ॥ పథకాలను చేపట్టి దేశానికే మార్గదర్శకుడయ్యారు కెసిఆర్! తెలంగాణ రాజధానికి లభించిన ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ జాతీయ అవార్డే అందుకు నిదర్శనం!
‘మిషన్ కాకతీయ’ను బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటున్నారు నిజమేనా తాతయ్యా? ఔను రామూ! చెరువుల నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు బాగా పెరిగినయ్. పంటలకు పుష్కలంగా నీళ్ళు అందుతున్నాయ్. చెరువుల్లో చేప పిల్లల్ని వేయించి పెంచుకోమని పేద వర్గాల వారికి ఉపాధి కల్పించారు. ధాన్యంతో పాటు పశు గ్రాసమూ పుష్కలంగా లభిస్తున్నది. సబ్సిడీ మీద గొర్రెల్ని, బర్రెల్ని ఇచ్చి పెంచుకోమన్నారు. పంటలతో పాటు పాడి, మాంసం ఉత్పత్తులు పెరిగినయ్. రిజర్వాయర్ల ద్వారా విద్యుదుత్పత్తి పెరిగింది. మరి ‘మిషన్ కాకతీయ’ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అనడంలో సందేహమేముంది?
‘మిషన్ కాకతీయ’ ద్వారా వ్యవసాయాధారిత ప్రజలందరి ఆదాయాలు పెరిగినయ్ అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది.
‘టిఎస్‌ఐ పాస్’ అను వేగవంతమైన పారిశ్రామిక విధానాలను చేపట్టడం, మత సామరస్యతను, శాంతి భద్రతలకు ప్రతీకగా రాజధానిని రూపొందించడం, భాగ్యనగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడం, నిరంతరం విద్యుత్, భారీ ఫ్లై ఓవర్లు , మెట్రో రైళ్ళ వంటి మౌలిక వసతుల రూపకల్పనతో స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెక్కలు గట్టుకు వాలుతున్నారు తెలంగాణలో. అలా పారిశ్రామిక రంగంలోనూ పరుగులు పెడుతుంది తెలంగాణ.
విషన్ కాకతీయ తో పాటు పోడు భూములకు పట్టాలిప్పించడం, రైతు బంధు పేరిట పెట్టుబడి అందించడం ద్వారా వ్యవసాయాభివృద్ధిని గణనీయంగా సాధించారు. దశాబ్దాలుగా వెనుకబడి వున్న తెలంగాణను పంజాబ్, హర్యానాలకు దీటైన ధాన్యాగారంగాను, వరి ఉత్పత్తిలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు అందించుటలో భారతాగ్రరాష్ట్రంగాను, తలసరి విద్యుత్ వాడకంలోనూ అగ్ర రాష్ట్రంగా, తలసరి ఆదాయ సాధనలో దేశంలో 4వ రాష్ట్రంగాను, పారిశుధ్య పాలనా రంగాలలో పలు జాతీయ అవార్డులు సాధించిన రాష్ట్రంగా, అద్భుత కళాక్షేత్రంగా, ఆధ్యాత్మిక కళాక్షేత్రం యాదాద్రిని కలిగిన రాష్ట్రంగా విలసిల్లుతున్నది తెలంగాణ. అందుకే నేడు ఆసేతు హిమాచల పర్యంతం భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నది తెలంగాణ. దటీజ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
విశ్వసనీయంగా వ్యవసాయం చేసే ఎద్దును వదులుకోరు రైతులు. మరి ఇంతటి జ్ఞానిని, రాజనీతిజ్ఞుని, దార్శనికుని, ప్రగతి సాధకుని, తమ ముద్దుబిడ్డను, తెలంగాణ పిత కెసిఆర్ నాయకత్వాన్ని వదులుకుంటారా తెలంగాణ ప్రజలు? చెప్పు రామూ! తెలంగాణయే కాదు అట్టి దార్శనిక నేతను భారత దేశమూ వదులుకోదు తాతా!
“మనిషి ఎదగడానికి దేశం కావాలి! ఎదిగిన ఆ మనిషి దేశానికి అవసరం” అన్నారొక తత్వవేత్త! రాజనీతిజ్ఞునిగా ఎదిగిన దార్శనిక నేత కెసిఆర్ కోసం నిన్న తెలంగాణ, నేడు భారత దేశమే ఎదురు చూస్తోంది. తెలంగాణ ప్రగతికి తోడ్పడినట్లే, భారత దేశ ప్రగతి కోసమూ పరిశ్రమించమంటూ కెసిఆర్‌ను సాదరంగా స్వాగతిస్తున్నది భరత మాత. అందుకే ‘హ్యాట్రిక్ సాధించిన తొలి దక్షిణ భారత ముఖ్యమంత్రిగా కెసిఆర్‌కు పట్టంగట్టి, తమ కృతజ్ఞతను చాటుకోవాలన్న దృఢ సంకల్పంతో వున్నారు తెలంగాణ ప్రజలు! తథాస్తు! తెలంగాణ ప్రజలకు, భారతీయులకూ శుభమస్తు! విజయీభవ! కెసిఆర్‌జీ దిగ్విజయీభవ?.
పాతూరి వేంకటేశ్వరరావు
9849081889