- Advertisement -
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వరంగల్‌లో ఈనెల 27 నిర్వహించనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానకొండూరు మాజీ ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ రచించి, గానం చేసిన ‘బండెనక బండి కట్టి – గులాబీల జెండ పట్టి‘ బిఆర్‌ఎస్ రజతోత్సవ పాటను ఆయన ఆవిష్కరించారు. నాటి నుంచి నేటివరకు పార్టీ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత రసమయికి సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎంఎల్‌ఎలు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -