Thursday, January 23, 2025

చిట్యాల వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనపర్తి జిల్లా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. కెసిఆర్ పై వనపర్తి ప్రజలు అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. జై కెసిఆర్ జై తెలంగాణ నినాదాలతో ప్రజలు తమ హర్షాతిరేకాలు ప్రకటించారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు అల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపిలు రాములు, మన్నేశ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ లో మన ఊరు – మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. నాగవరం లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఇంటిగ్రెటెడ్ జిల్లా కార్యాలయాల నూతన భవన సమూదాయాలను  ప్రారంభిస్తారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. నాగవరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంఖుస్థాపన చేస్తారు. పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని కెసిఆర్ ప్రసంగిస్తారు.

KCR launches Chityala Agricultural Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News