Monday, December 23, 2024

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు ఐకియా జంక్షన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఇది కనుక పూర్తయితే నగరం నుంచి విమానాశ్రయానికి కేవలం 26 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించనుంది. అనేక చోట్ల ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఆదిబట్ల వద్ద నున్న ఏరోసిటీ, ప్రతిపాది ఫార్మా సిటీలను కలపడమేకాక, దక్షిణ హైదరాబాద్‌కు ప్రజా రవాణా వసతిని కల్పించనున్నది. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 6250 కోట్లు ఖర్చు కానున్నది. ఇది మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి షంశాబాద్‌లోని హైదరాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో లైనును కలుపుతుంది.

31 కిమీ. ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను నిర్మించేందుకుగాను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్)ను ఏర్పాటు చేశారు. ఇదో సంయుక్త వెంచర్. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టిఎస్‌ఐఐసి) ఈ వెంచర్‌ను చేపట్టాయి.

హైదారాబాద్ మెట్రో రైల్ కన్నా ఈ కారిడార్‌కు అనేక అత్యాధునిక వసతులు ఉంటాయని హెచ్‌ఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. హాంకాంగ్ లేక గాట్విక్ విమానాశ్రయం కంటే మెరుగైన వసతులను అందించాలని ఆయన లక్షంగా పెట్టుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్కువ బోగీలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను ప్రతి స్టేషన్‌లో ఏర్పాటుచేయనున్నారు. విమానాల రాకపోకలకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు ‘ఫ్లయిట్ ఇన్‌ఫార్మేషన్ డిస్‌ప్లే’ ను కూడా ఉండనుంది. అలాగే ప్రతి ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్‌లో ‘ఇన్‌ఫార్మేషన్ డెస్క్’ కూడా ఉండనున్నది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News