Wednesday, January 22, 2025

ఘోష్ కమిషన్‌కు కీలక ఫైళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాశేశ్వరం క మిషన్ ఎదుట రిటైర్డు ఇఎన్‌సి (ఇంజనీర్ ఇన్ చీఫ్) నల్లా వెంకటరేశ్వర్లు సోమవారం మరోసారి హాజరై పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు), డి జైనింగ్, డ్రాయింగ్ తదితర కీలక నిర్ణయాల న్నీ అప్పటి సిఎం కెఆర్ ఆదేశాల మేరకే జరిగాయని స్పష్టం చేసారు. సీఎం హోదాలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకతప్పలేదని ఆయన కమిషన్‌కు వివరించారు. వీటికి సం బంధించి రికార్డు చేసిన మినిట్స్‌ను వెంకటేశ్వర్లు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుం గుబాటుకు నిర్వహణ లోపం కారణమా? అ ని కమిషన్ ప్రశ్నించింది. నిర్వహణ లోపం కా రణంగానే మేడిగడ్డ బ్యారేజి కుంగిది కదా? అ ని కమిషన్ ఆరా తీసింది. నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా బ్యారేజీ కుంగిందని వెంకటేశ్వర్లు చెప్పినట్టు తెలిసింది. గేట్ల సమస్య ఎప్పుడు వచ్చింది? బ్యారేజిలో నీటి వత్తిడి వల్లనే కదా?

అని కమిషన్ ప్రశ్నిస్తూ, అసలు మూడు బ్యారేజీలలో పూరిస్థాయిలో నీరు నింపమని ఆదేశించింది ఎవరని కమిషన్ ప్రశ్నించగా, నిం పడం కారణమా? ఆ నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వ అధినేత (సిఎం కేసీఆర్) ఆదేశాల మేరకే జరిగిందని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సాంకేతిక నిర్ణయాలను ఇంజనీరింగ్ నిపుణులు తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్ర శ్నించగా, సిఎం హోదాలో ఆదేశించినప్పుడు అమలు చేయకతప్పలేదని వెంకటేశ్వర్లు తన నిస్సాయతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు డిపిఆర్, డిజైనింగ్, ్ర డాయింగ్‌తో పాటు బ్యారేజీలలో నీళ్లు నింపడం వరకు ప్రతి కీలక నిర్ణయం, ఆదేశం అప్పటి సిఎం కెసిఆర్‌దేనని రిటైర్డు ఇఎన్‌సి చెప్పడం కమిషన్‌కు చె ప్పడం కీలక పరిణామం. ప్రాజెక్టు డిపిఆర్ ఫైనల్ చేయమని సిఎం ఆదేశించారని అంటున్నారు, అందుకు సంబంధించి సాక్షం ఏ ముందని కమిషన్ ప్రశ్నించగా, వాటికి సం బందించి మినేట్స్‌ను వెంటేశ్వర్లు కమిషన్‌కు సమర్పించినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రా జెక్టుకు సంబంధించి మేడిగడ్డ, సుందిళ్ల, అ న్నారం మూడు బ్యారేజీలకు సంబంధించిన అంచనాల పెంపుదలకు సంబంధించిన పత్రాలను కూడా కమిషన్‌కు వెంకటేశ్వర్లు అందజేసినట్టు తెలిసింది.

మేడిగడ్డ బ్యారేజీ తొలి అంచన రూ.2591, కోట్లు, అన్నారం రూ.1785, సుందిళ్ల రూ. 1437 కోట్లు కాగా ఇవీ పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ రూ.4613 కోట్లు, అన్నారం రూ.2700 కోట్లు, సుందిళ్ల రూ.2200 కోట్లకు పెరిగినట్టు వెంకటేశ్వర్లు కమిషన్‌కు వివరించారు. ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన నివేదికను కమిషన్‌కు అందినట్టు తెలిసింది. అలాగే రెండు, మూడు రోజులలో విజిలెన్స్ కమిటీ కూడా తన నివేదికను కమిషన్‌కు అందజేనున్నదని అధికార వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News