Sunday, December 22, 2024

పేదోళ్ల కలను సాకారం చేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను పా రదర్శకంగా పంపిణీ చేసిందని డిప్యూ టీ మేయర్ మోతే శ్రీలతశోభన్ రెడ్డి, బిఆర్‌ఎస్ కార్మికవిభాగం రాష్ట్ర అద్యక్షుడు మో తే శోభన్‌రెడ్డి పేర్కోన్నారు. తార్నాక డివిజన్‌కు చెందిన లబ్ధ్దిదారులు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు అయిన సందర్బం గా సోమవారం డిప్యూటీ మేయర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా మొదటి విడత పంపిణీలో లాటరీ ద్వారా ఎంపిక చే సి పేదోళ్లను కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌దేనని అన్నారు.మొదటి విడతలో ఎంపిక కానీ వారికి పలు దఫాలలో పంపిణి చేసే కార్యక్రమం త్వరలోనే ఉంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో జీవించాలనే కోరికను డ బుల్ బెడ్ రూమ్ ద్వారా లక్షాన్ని నెరవేర్చి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News