Tuesday, December 24, 2024

అమరవీరులు కన్న కలలను నిజం చేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంను నెంబర్ వన్‌గా నిలిపి అమరవీరులు కన్న కలలను సిఎం కెసిఆర్ నిజం చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలనే సదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో భాగంగానే అమర జ్యోతి ఏర్పాటు చేశారని అన్నారు.

ఉద్యమంలో అసువులు బాసిన 615 అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం, రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేశారని వెల్లడించారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

సభా ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాలో అమరవీరులైన ఉద్యమ వీరుల జాబితా చదువుతూ పేరు పేరునా వారిని స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, మున్సిపల్ కమీషనర్ సుమన్ రావుతోపాటు రామగుండం నియోజక వర్గం, నగర పాలక సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News