హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆర్టీసి పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వ సహకారం తో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసి ఆర్థిక పరిస్థితిపై చర్చలు జరుపుతున్నారు. పెరిగిన డీజిల్ రేట్లతో కరోనాతో ఆర్ టిసి సంస్థ ఎప్పుడు లేని నష్టాలను చవిచూసింది. ఆర్ టిసి సంస్థ తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, , ఆర్టీసి ఎండి సజ్జనార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిసిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.