Friday, November 22, 2024

లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి మధ్య పోటీ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ గెలవబోతుందని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని 0ఆరోపించారు. బిఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని సూచించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు.

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధి నేతలతో కెసిఆర్ బేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి మధ్య పోటీ ఉంటుందని కెసిఆర్ వెల్లడించారు. ఈ నెల 12న కరీంనగర్ లో బిఆర్ఎస్ బహిరంగ సభ. మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని కెసిఆర్ సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. రేపు బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను పార్టీ ప్రకటించనుంది. కరీంనగర్ నుంచి బిఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించనుంది. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో బిఆర్ఎస్ సభ నిర్వహించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News