బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు
కరీంనగర్, ఆదిలాబాద్ నేతలతో భేటీ
రజతోత్సవ బహిరంగసభ నిర్వహణపై
నాయకులకు దిశానిర్దేశం
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు
కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా
నేతలతో భేటీ పార్టీ రజతోత్సవ
బహిరంగ సభ నిర్వహణపై
నాయకులకు దిశానిర్దేశం
ప్రభుత్వ చర్యలతో రైతులు,
వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం
కోల్పోతున్నారని విచారం
మన తెలంగాణ/మర్కుక్/గజ్వేల్: ప్రజలకు ధైర్యం ఇచ్చేలా వరంగల్ సభ ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో ఈనెల 27 నిర్వహించనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో పార్టీ అధినేత కెసిఆర్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో గురువారం సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ అధినేత ఆ రెండు జిల్లాల ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ వింతైన పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. మార్పు కోరుకుంటూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చినా రైతుల కళ్ళలో కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలోనైనా తాను ఊహించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ ఎంపిలు బోయినపల్లి వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంఎల్‌సి ఎల్.రమణ, ఎంఎల్‌ఎలు డా.కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు (కరీంనగర్ ), తోట ఆగయ్య (సిరిసిల్ల), జోగు రామన్న (ఆదిలాబాద్), బాల్క సుమన్ (మంచిర్యాల), మాజీ ఎంఎల్‌ఎలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగర రావు, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు, పార్టీ జిల్లాల నాయకులు దావా వసంత, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జాన్సన్ నాయక్, రామకృష్ణారెడ్డి, రమాదేవి, కిరణ్ కొమ్మెర, విలాస్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.