Monday, December 23, 2024

వస్తున్నా…

- Advertisement -
- Advertisement -

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే… తెలంగాణకు నష్టం జరుగుతుందని… ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని.. తెలంగాణ హక్కులపై పార్లమెంట్ లో గళం విప్పాలని బిఆర్ఎస్ ఎంపిీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.   ఎర్రవెల్లి నివాసంలో కెసిఆర్  అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

మన తెలంగాణ/హైదరాబాద్/ గజ్వేల్ జోన్ : బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని… త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని.. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని చెప్పారు. అధికారం లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాష్ట్రం హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడాలని, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో గళం బలంగా వినిపించాలని చెప్పారు.

ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేసారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News