Wednesday, January 22, 2025

కేసీఆర్ తో ముగ్ధుంపూర్ రైతుల మొర

- Advertisement -
- Advertisement -

వంట నష్టపోయిన రైతాంగానికి కష్టకాలంలో బిఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ముగ్ధుంపూర్ పక్కనే ఉన్న వాగులో నీళ్లు లేక, తమ పంటలు ఎండిపోయాయని రైతులు వాపోయారు. తాను మూడెకరాల్లో సాగు చేస్తున్న వరి పంటకు నీరందక ఎండిపోయిందని బండి సంపత్ అనే రైతు కేసీఆర్ తో మొరపెట్టుకున్నాడు. తమకు ఎకరాకు రూ.25వేల రూపాయల నష్ట పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతులు కేసీఆర్ ను కోరారు.

రైతులను కేసీఆర్ ఓదారుస్తూ,  ఇలాంటి పరిస్థితి తెలంగాణలో వస్తుందని ఊహించలేదన్నారు. అన్నదాతలకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ధైర్యంగా ఉండండి సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వంపై పోరాడుదాం అని రైతులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ విప్ బాల్క సుమన్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు బారాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ఉన్నారు.

అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కు సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News