Friday, December 20, 2024

పార్టీ నేతలతో గులాబీ బాస్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కెసిఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గెలిచిన ఎంఎల్‌ఎలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీ ఇతర నేతలు కెసిఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

కెసిఆర్‌ను ధృవీకరణ పత్రాన్ని అందజేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గంలో ఎంఎల్‌ఎగా గెలిచిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ధ్రువీకరణ పత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్ రావుతో కలిసి స్థానిక నేత వంటేరు ప్రతాపరెడ్డి ఆయనకు అందజేశారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News