Monday, December 23, 2024

అప్పుడు మన్మోహన్‌ను.. ఇప్పుడు మోడీని అడిగాం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఒబిసికి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. వచ్చే బడ్జెట్‌లోనైనా ఒబిసిలకు అధిక బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ట్వీట్ చేశారు. 2004లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కెసిఆర్ కలిసి ఒబిసికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఒబిసి సంఘాలను తీసుకెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్‌తో సమావేశమైన ఫోటోను కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యూపిఏ ప్రభుత్వం ఒబిసి సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకోలేదని, ఎన్డీయే ప్రభుత్వమైనా ఒబిసి శాఖను ఏర్పాటు చేసి, తగిన ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News