Friday, December 27, 2024

బిఆర్‌ఎస్‌లో మాకు ఓనర్‌షిప్ ఇవ్వలేదు: కడియం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కంపెనీలో పని చేసే కార్మికులుగానే గుర్తించారని, పార్ట్‌నర్స్ అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడు ఓనర్ షిప్ రాకపోవడంతో మనసు పెట్టి పెట్టి పని చేయడం కష్టమైందన్నారు. తమ అభిప్రాయాలను కెసిఆర్ ఎప్పుడు లైట్ తీసుకునేవారని, ఆయనకు ఎం తెలుసునని అడిగారు. కడియం శ్రీహరి బిఆర్‌ఎస్ పార్టీని వీడిన సందర్భంగా ఆయనపై ఆ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. రాజకీయాల్లో కెసిఆర్‌కు కడియం శ్రీహరి చేసిన నమ్మకం ద్రోహం ఎవరు చేయలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News