కామారెడ్డి న్యూస్: వారం, పది రోజుల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభిస్తామని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి సహా 9 జిల్లాల్లో 1.24 లక్షల మంది గర్భిణులకు అందజేస్తామన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కెసిఆర్ కిట్ తో పాటు పుట్టక ముందు న్యూట్రిషన్ కిట్ అందిస్తామని వివరించారు. కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ ను హరీష్ రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేద వారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఉండేదన్నారు.
డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచిందన్నారు. 102 డయాలసిస్ సెంచర్లు పెంచాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నామని హరీష్ రావు తెలిపారు. యుద్ధ ప్రాతిపాదికన వీటిని ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా గా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజుడ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామన్నారు. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్‌కూడా ఇస్తున్నామని, ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని, ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తుందని, డయాలసిస్ రోగులకు పింఛను ఇస్తున్నామని, కిడ్నీ రోగుల కోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేసున్నామని హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత సుమారు రూ.700 కోట్లు కిడ్నీ రోగులకోసం ఖర్చు చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డప్పడి నుంచి ఇప్పటివరకు 49.8 లక్షల డయాలిసిస్ సెషన్స్ చేయడం జరిగిందని, వచ్చే వారంలో 50 లక్షల సెషన్ లు పూర్తి చేస్తామని హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఒక గొప్ప విషయమని, బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కెసిఆర్ కిట్ ఇస్తామని, కెసిఆర్ కిట్ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంతో ఇదే స్ఫూర్తితో మహిళల సంక్షేమం కోసం పాటుపడుతామన్నారు.
అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో న్యూటిషన్ కిట్ ప్రవేశ పెట్టడం జరుగుతుందని వివరించారు. మొత్తం 1.24 లక్షల మంది నమోదు కాబడిన గర్బిణులకు ఇది ఉపయోగపడుతుందని,
ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడంతో పాటు హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యమన్నారు.