Sunday, December 22, 2024

గ్రేటర్ పేదలకు దసరాకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు

- Advertisement -
- Advertisement -

KCR Nutrition Kits for Pregnant Women on Dussehra

గర్భిణీలో పాష్టికాహారం లోపం లేకుండా పంపిణీ
ఒక్కో లబ్దిదారుకు రెండు కిట్ అందజేయనున్న వైద్యశాఖ
బస్తీదవఖానాల సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు

హైదరాబాద్: నగరంలో గర్భిణీల్లో పౌష్టిక ఆహార లోపాల్ని తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు దసరా తరువాత కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు 09 జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం చుట్టుడుతున్నట్లు బతుకమ్మ కానుకగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదే తరహాలో గ్రేటర్ నగరంలో కూడా పేదల ఆరోగ్య పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని రెండవ విడుత అందజేయనున్నట్లు తెలిపారు. నగరంలో మొదటి దశలో 30వేల మందికి కెసిఆర్ కిట్‌లను పంపిణీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఒక్కొ లబ్దిదారుకు రెండు కిట్‌లు ఇవ్వనున్నట్లు, ఒక కిట్ ధర రూ. 2వేలు ఉంటుందని, అందులో నెయ్యి, ఖజూర్, హార్టిక్స్ వంటి పౌష్టిక పదార్దాలుంటాయన్నారు.

గర్భదారణ దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెలకోసారి ఈకిట్ లబ్దిదారులకు అందుతుందన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు కెసిఆర్ కిట్ ప్రవేశపెట్డడం ద్వారా నగర ప్రజలు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందారని, ఆపథకానికి మంచి ఆదరణ రావడంతో త్వరలో కెసిఆర్ నూట్రిషన్ కిట్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చి ఆరోగ్య హైదరాబాద్‌గా పేరు తీసుకొస్తామని ఆసుపత్రుల వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల సాధారణ ప్రసవాలు చేస్తే వైద్య సిబ్బందికి రూ. 3వేలు పారితోషికం ప్రకటన చేయడంతో వైద్య సిబ్బంది గర్భిణీలు వైద్య సేవల కోసం వస్తే నాణ్యమైన చికిత్సలు అందిస్తూ ఆసుపత్రుల సంఖ్య పెరిగేలా చూస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత నగరంలోని పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే పరిస్దితి లేకపోవడంతో ఎవరు ఊహించని విధంగా బస్తీదవఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు సకాలంలో వైద్యం అందుతుండటంతో గ్రేటర్ వాసులు ఆసుపత్రుల పనితీరు ప్రశంసలు కురిపిస్తున్నారు.అదే విధంగా పరీక్షల కోసం 16 డయాగ్నస్టిక్ హబ్‌లు తీసుకరావడం పేద గుండెల్లో చిరస్దాయి నిలిచిపోయారని రోగులు బంధువులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News