Monday, December 23, 2024

న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి పోషాకాహారం అందిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ కిట్‌తో పాటు న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టామని సిఎం కెసిఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి పోషాకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం తయారు కావాలన్నదే ప్రధాన లక్ష్యమని కెసిఆర్ స్పష్టం చేశారు.ఒక్క జనరేషన్ దెబ్బతింటే కోలుకోవడానికి 75 సంవత్సరాలు పడుతుంది అని సిఎం తెలిపారు. ఈ సమస్యను అధిగమించాలంటే గర్భంలో పెరిగే శిశువు బాగుండాలని, అందుకు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు.

దీంతో భవిష్యతు తరాలు బాగుంటాయని అన్నారు. కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రలుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు. మాతా,శిశు మరణాలను నివారించామని చెప్పారు. 2014లో (ఎంఎంఆర్) తల్లులు 92 మంది చనిపోతే ఇవాళ 43కు తగ్గించామని, అలాగే శిశు మరణాలను 21కి తగ్గించామని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 76 శాతానికి పెంచామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News