Monday, December 23, 2024

మాది న్యూట్రిషన్.. వారిది పార్టిషన్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: మాది పనులు చేసే ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపిది పన్నులు సే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దెప్పిపొడిచారు. తల్లి మనస్సుతో ఆలోచించే సిఎం కెసిఆర్ ప్రజలకు మేలు కలిగేలా పలు పథకాలను ప్రవేశపెడుతున్నారని, దీనిలో భాగంగానే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్, డెలివరీ అయిన తరువాత కెసిఆర్ కిట్‌ను అందిస్తున్నారన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలో కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్ పంపిణీని బుధవారం హరీశ్ రావు ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన కార్యక్రమంలో మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కిట్స్ పథ కం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న 9 జిల్లాల మంత్రులకు, ప్రజాప్రతినిధులకు హరీశ్‌రావు ధ న్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్‌రా వు మాట్లాడుతూ న్యూట్రిషియన్ పాలిటి క్స్, వారివి పార్టిషన్ పాలిటిక్స్‌లని ఎద్దేవా చేశారు. ప్రజా కోణంలో ఆలోచించి సిఎం కెసిఆర్ ప థకాలను ప్రారంభిస్తున్నారన్నారు. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభు త్వం మరో విప్లవాత్మకమైన పథకానికి ఈ విధం గా శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. న్యూట్రిషియ న్ కిట్ పథకం ఒక చారిత్మాక ఘట్టమన్నారు. ఎక్కువగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావంతో ఉన్న గర్భిణుల సంఖ్య 9 జిల్లాలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్,

కామారెడ్డి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌లు ఉన్నాయన్నారు. మొత్తం 1.25 లక్షల మంది గర్భిణులకు రెండు ఎస్‌ఎన్‌సిల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. దీని కోసం రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో కిట్ దాదాపు రూ.2వేలతో రూపొందించి కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. 13, 27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్ సమయంలో ఒకసారి 28,34 వారాల మద్య చేసే మూడో ఎఎన్‌సి చెకప్ సమయంలో రెండోసారి కిట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రులు బాగా పెరిగాయని ప్రభుత్వాసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు 66 శాతం పెరిగాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

పడకలు 17 వేల నుంచి 28 వేలకు పెంచుకున్నట్లు తెలిపారు. ఐసీయూ బెడ్స్ 200 నుంచి 600లకు పెంచుకున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, జడ్పి చైర్‌పర్సన్ శోభ, ఎంఎల్‌ఎలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహాంతి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఇందూ ప్రియ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంలో శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ములుగులో శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లిలో మంథని ఎంఎల్‌ఏ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించగా, వికారాబాద్ పరిగిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,

నాగర్ కర్నూల్‌లో టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గద్వాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొని కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్ ప్రాధాన్యతను మహిళలకు తెలియజేశారు. అనంతరం అయా ప్రాంతాల్లో గర్భిణులకు కిట్స్ పంపిణీ చేశారు. కాగా, పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న 9 జిల్లాల మంత్రులకు, ప్రజాప్రతినిధులకు హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News