Saturday, November 23, 2024

విశ్వనగరిలో సమృద్ధిగా జలసిరి

- Advertisement -
- Advertisement -

మహానగరానికి జలహారం జలమండలి
రూ. 3866 కోట్లతో 31 కొత్త ఎస్టిపిల నిర్మాణం
రూ.1450 కోట్లతో నిర్మించే సుంకిశాల హెచ్‌ఏయూ ప్రాంతానికి మంచినీటి భరోసా
ఓఆర్‌ఆర్ ప్రాంతాల తాగునీటికి రూ. 1200 కోట్లు కేటాయింపు
జిహెచ్‌ఎంసి పరిధిలో ఉచితంగా 20వేల లీటర్ల తాగునీటి పథకం

KCR on concentrate on Development of Hyderabad

విశ్వ నగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంలో మౌళిక సదుపాయా లను మెరుగుపరచడంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నలుదిశలా వేగంగా విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న జనాభాకు, ఏర్పడుతున్న కొత్త కాలనీ లకు తగినట్లుగా మౌళిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన మంచినీటి సర ఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి జలమండలిపైన ప్రభుత్వం మహత్తర బాధ్యతలను పెట్టింది. ఇందుకు తగ్గట్లుగా నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుత అవసరాలే కాకుండా రానున్న 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు తగ్గటుగా మౌళిక వసతులు ఉండా లనే ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మార్గదర్శకంలో, ఎండీ దానకిషోర్ జలమండలి ఈఏడాది కీలక ఘట్టాలకు నాంది పలికింది.

 

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోనే కాక ఒఆర్‌ఆర్ పరిధిలో కొత్త జనవాసాలు ఏర్పడుతుండటం, జనాభా పెరుగుతుండటంతో మంచినీటి సరఫరాను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 1200 కోట్ల నిధులను కేటాయించింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా ఎక్కువగా తాగునీటి సరఫరా కు సమస్యలు రాకుండా అవసరమైన చోట్ల జలమండలి కొత్త రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు పైప్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. రూ. 1450 కో ట్లతో నాగార్జునసాగర్ వద్ద నిర్మించనున్న సుంకిశాల ఇంటేక్ వెల్ ద్వారా హైదరబాద్ అర్భన్ అగ్లామరేషన్ ప్రాంతంలో తాగునీటికి భరోసా దక్కనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాల్లో ప్రతి రోజు 480 ఎంజిడిల మంచినీటి సరఫరాతో ఒక కోటిమంది నగర ప్రజల దాహార్తి తీరుస్తుంది. గోదావరి నుంచి 155 ఎంజీడి, కృష్ణా నుంచి 275 ఎంజీడిలు తరలించడంతో పాటు అవసరం మేరకు మంజీర, సింగూరు జలాలు తరలించి జలమండలి సరఫరా చేస్తోంది. అదే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ప్రతినెల 20వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈపథకం నగరవాసులందరికి అందించేందుకు జలమండలి ప్రయత్నిస్తోంది. నగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని పూర్తిస్దాయిలో శుద్ది చేయాలనే మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆలోచనల మేరకు జలమండలి పనిచేస్తోంది. ఎస్టీపీల నిర్వహణలో గరిష్ట సామర్దంతో మురుగునీటి శుద్ధి చేయడంలో మన న గరం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నగరంలోని చెరువులు, మూసీ నది శుద్ధి కావాలంటే మురుగునీటిని 100శాతం శుద్ధి చేయాలనేది సిఎం కెసిఆర్ ఆలోచన. ఇందుకోసం నగరంలో కొత్త గా 31 ఎస్టీపీల నిర్మాణానికి జలమండలికి ప్రభుత్వం రూ. 3866.21 కోట్లను కేటాయించింది. అలాగే జోన్ 3 పరిధిలోని కా ర్వాన్ నియోజకవర్గంలో రూ. 300 కోట్ల వ్యయంతో సీవరేజి వ్యవస్దను ఆధునీకరించి మురుగు సమస్యను పరిష్కరించడం జరిగింది.

31 ఎస్టీపీ నిర్మాణానికి రూ. 3866. 21 కోట్లు మంజూరు

గత రెండేళ్లుగా షా టెక్నాలజీస్ అనే సంస్థ్దతో నగరంలో సీవరేజి వ్యవస్థ్దపై అధ్యయనం చేసి ఒక నివేదిక ను సమర్పించింది. దీని ప్రకారం జీహెచ్‌ఎంసీ పదేళ్ల తరువాత 1950 ఎంఎల్‌డీల వరకు మురుగునీటి ఉత్పత్తి అవుతుందని అంచనా. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ పదేళ సరిపోయేలా ఇప్పుడు ఉన్న 772 ఎంఎల్‌డిల సామర్థ్దం ఉన్న ఎస్టీపీలకు అదనరంగా 1295.5 ఎంఎల్‌డిల సామర్దంతో కొత్త సీవరేజీ ట్రిట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ. 3866. 21కోట్లు మంజూరు చేసింది. ఎస్టీపీలను నిర్మించిన సంస్దలకే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు ఇవ్వనున్నారు. చెరువులు, నాలాలు, మూసీ సమీపంలో ఈప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇంతపెద్ద మొత్తంలో ప్రభుత్వం జలమండలికి నిధులు మంజూరు చేయడం ఇదే మొదటిసారి. జీహెచ్‌ఎంసీలోనే కాకుండా ఓఆర్‌ఆర్ పరిధిలో కూడా మూడు ప్యాకేజీల్లో నిర్మించి దసరాలోపు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలను సిద్దం చేసింది. ఎస్టీపీల వద్ద కెపమెరాలు, ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్దను ఏర్పాటు చేసి ఎక్కడినుంచైనా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించింది.

శివారు ప్రాంతాల తాగునీటికి రూ. 1200 కోట్లు

శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ. 1200 కోట్లతో 137 ఎంఎల్ సామర్దం కలిగిన రిజర్వాయర్‌ల నిర్మాణానికి 2100 కిమీ పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో శివారు ప్రాంతాల్లో దాదాపుగా 20 లక్షల కుటుంబాలకు మంచినీటి సమస్య తీరుతుంది. 2 లక్షల కొత్త మంచినీటి కనెక్షన్లు కూడా ఇవ్వాలని జలమండలి భావిస్తోంది. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేయాలని జలమండలి లక్షం నిర్దేశించుకుంది.

జలమండలి శివారు ప్రాంతాల సీవరేజీ నిర్వహణ

శివారు మున్సిపాలిటీల్లోని 66 జీహెచ్‌ఎంసీ వార్డులో దాదాపుగా 3600 కిమీ సెవరెజీ పైపులైను వ్యవస్థ్ద, 3.26 లక్షలకు పైగా మ్యాన్‌హోళ్ల నిర్వహణకు దాదాపుగా 650మంది కార్మికులు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈనిర్వహణ ఖర్చులకు నెలకు రూ. 12 కోట్ల చొప్పన జీహెచ్‌ఎంసీ జలమండలికి చెల్లించనుంది. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న 24 ఎయిర్‌టెక్ యంత్రాలు, 66 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలు జలమండలికి అప్పగించింది. ఇప్పటికే శివారు మున్సిపాలిటీలోని 8 డివిజన్లలో 73 సెక్షన్లతో విస్తరించి మంచినీటి సరఫరా చేస్తోంది.

నగరవాసులకు వరంగా ఉచితంగా 20వేల లీటర్ల జలం

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు వరంలాంటి ఉచిత 20వేల లీటర్ల మంచినీటి పథకాన్ని ప్రభుత్వం ఈసంవత్సరం ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీలో గృహ కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు నెలకు 20వేలు లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈపథకం ఉద్దేశ్యం. జనవరి 12వ తేదీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్, రెహమత్ నగర్‌లో ఈపథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈపథకం ద్వారా సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందున్నాయి.

ఓఆర్‌ఆర్ గ్రామాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా

ఓఆర్‌ఆర్ లోపల మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామపంచాయితీల్లో 193గ్రామాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు.ఈప్రాంతాలకు ఇప్పటికే సరఫరా చే స్తున్న నీటి కంటే 50 ఎంఎల్‌డీల నీటిని జలమండలి అదనంగా సరఫరా చేయడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న 56వేలపైగా కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి.

ఔటర్ చుట్టూ రింగ్ మెయిన్

నగరవాసులకు నీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జలమండలి రింగ్‌మెయిన్ ప్రాజెక్టును చేపట్టింది. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ భారీ పైప్‌లైన్ నిర్మించనుంది. నగరానికి నీరు రావడంలో ఎటువైపు నుంచి సమస్య వచ్చినా మరో వైపు నుంచి నీరు నగరమంతా సరఫరా చేసుకునేందుకు రింగ్‌మెయిన్ వీలు కల్పిస్తుంది. అదే విధంగా రిజర్వాయర్ల వద్ద కాపలా.. సీసీ కెమెరాలు, శివారు ప్రాంతాల్లో మురుగునీటి సమస్యల పరిష్కారానికి రూ. 35 కోట్లు కేటాయింపు. జలమండలికి యాదాద్రిలో సీవరేజీ వ్యవస్దకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. నూతన ఎఫ్‌ఎస్‌టీపి ప్రారంబించిన మంత్రి కెటిఆర్, ఎల్బీనగర్ జంట రిజర్వాయర్ల ప్రారంభం, పోన్ చేస్తే సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం, జలమండలి అభివృద్ది పనుల, నీటి సంరక్షణ పద్దతులను, మురుగునీటి శుద్దిని ఏపి అధికారులు బృందం పర్యటన చేపట్టింది.అదే విధంగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్యటన, జలమండలిని సందర్శించిన నాలుగు రాష్ట్రాల అధికారులు, 93 మంది కొత్త మేనేజర్ల నియామకం, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, పీఆర్సీ అమలు, కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జలమండలి థీమ్ పార్కుకు ఎక్స్‌లెన్స్ అవార్డు, గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం వాటర్ క్యాంపులు, ఈఏడాది కురిసిన వానలకు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిండుకుండల్లా తలపిస్తూ రెండేళ్లవరకు తాగునీటికి డోకాలేదని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News