- Advertisement -
డా.బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఆయన సేవలను గుర్తుచేశారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. పేదల కోసం దళితబంధు సహా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని కెసిఆర్ అన్నారు. కాగా, బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కెసిఆర్.. ఇప్పటికే పలు జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఈ నెల 27న వరంగల్ లో భారీ రజతోత్సవ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
- Advertisement -