Monday, January 20, 2025

నామినేషన్ పత్రాలతో కొనాయిపల్లి ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఉదయం కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్.. స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం సిఎం కెసిఆర్‌కు సెంటిమెంట్ కావడంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను సిఎం కెసిఆర్ ఫాలో అవుతున్నారు.

కాగా, ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. సిఎం కేసిఆర్ తన రాజకీయ జీవితం మొదలుకొని ప్రతి ఎన్నికల్లో కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజల అనంతరం నామినేషన్ వేసి ఎన్నికల బరిలోకి దిగుతారు సిఎం కెసిఆర్.

కెసిఆర్ కు సెంటిమెంట్ గా మారింది ఇలా…!
కోనాయిపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో మహిమ ఉందని ప్రచారం జరగడంతో భక్తులు ఆలయానికి వచ్చి మోక్కులు తీర్చుకునేవారు. ఆలయ గొప్పతనం గురించి తెలుసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసిఆర్) 1985లో- జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పూజలు చేసి తన రాజకీయ గురువు మదన్ మోహన్ పై గెలుపొందడంతో కోనాయిపల్లి ఆలయం ఆయనకు సెంటిమెంట్ గా మారింది.

అప్పటి నుంచి 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీకి ముందు ఆలయంలో పూజలు చేసిన తరువాత నామినేషన్ వేసేవారు. అలాగే ఏకొత్త పని ప్రారంబించినా ముందుగా ఇక్కడ పూజలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News