Thursday, July 4, 2024

‘నోటీసులకు జవాబివ్వకముందే ప్రెస్‌మీట్ ఎలా పెట్టారు’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ రద్దు చేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విద్యుత్ విచారణ కమిషన్‌పై కెసిఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని కెసిఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని, జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా ప్రెస్‌మీట్ పెట్టారని, ప్రెస్‌మీట్ నిర్వహణ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని, నోటీసులకు జవాబివ్వకముందే ఎలా ప్రెస్‌మీట్ పెట్టారని కెసిఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇఆర్‌సి నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు చేశామని, విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ అని, ఇఆర్‌సి నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయకూడదని, కమిషన్ తీరు ఏకపక్షం, నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News