- Advertisement -
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదామని పలువురు నేతలతో ఆయన చర్చలు జరుపుతున్న ముచ్చట తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల సిఎంలు, నేతలతో సిఎం కెసిఆర్ ఫోన్ లో చర్చలు జరిపారు. బెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, తేజస్వీయాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ లతో ఫోన్ లో ప్రస్తుత రాజకీయ అంశాలు, కేంద్ర విధానాలపై చర్చించారు. కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కోరారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడదామని పిలుపునిచ్చారు.
- Advertisement -