Monday, December 23, 2024

తెలంగాణ దశ దిశను మార్చిన ప్రియతమ నేత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ దశ దిశను మార్చిన ప్రియతమ నేత
ట్విటర్లో కెసిఆర్ ఫొటోలు షేర్ చేసిన ఎంఎల్‌సి కవిత

KCR Photos share by MLC Kavitha
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫొటోలు కొన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఒక్కడిగా మొదలై ప్రియతమ నేతగా ఎదిగిన క్రమంలో కొన్ని చిత్రాలు అంటూ ట్వీట్ చేశారు. ఒక్కడిగా మొదలై, యావత్తు తెలంగాణను కదిలించి, తెలంగాణ దశ దిశను మార్చిన మన ప్రియతమ నేత కెసిఆర్ ప్రయాణంలో కొన్ని చిత్రాలు…అంటూ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా… ఉద్యమ సమయంలో.. టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు.. బహిరంగ సభల్లో కెసిఆర్ మాట్లాడడం లాంటి ఫొటోలు కవిత షేర్ చేశారు.

తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దడుతా.. ఇవి తెలంగాణ సాధనలో కెసిఆర్‌ను హీరోగా చేసిన మాటలు. దశాబ్దాల కల సాకారానికి ఊపిరిలూదిన మాటలు. తెలంగాణ జాతి పితగా కేసీఆర్ అవతరించడానికి మార్గనిర్దేశనంగా నిలిచిన మాటలు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర కలను నిజం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడడం నుండి రాష్ట్రావతరణ వరకూ దశాబ్దంన్నరపాటు సాగిన మలిదశ ఉద్యమం ఓ పెద్ద చరిత్రే. ఆ ఉద్యమానికి సంబంధించిన కొన్ని జ్ఠాపకాలు ఇలా పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News