Tuesday, December 24, 2024

1000 అడుగుల విస్తీర్ణంలో కెసిఆర్ చిత్రపటం…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఎఎంసి చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి పువ్వాడ అజయ్ పిఎ సిహెచ్ రవికిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు నాయకులు రైతులు, ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ముఖచిత్రాన్ని అపరాలతో పేర్చి జై కెసిఆర్.. జై తెలంగాణ అని పేర్చారు. మొన్న మిర్చి, నిన్న పత్తి సంబురాల తరహాలో నేడు అపరాల సాగు రైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. మక్క, కంది, పెసర పంటలతో రూపుదిద్దుకున్న ఈ తరహా సిఎం కెసిఆర్  చిత్ర పటం యావత్ దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. 24 గంటల పాటు శ్రమించి 1000 అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు.  రైతుబంధు ఇచ్చినందుకు అపరాల సాగు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News