Monday, January 20, 2025

కామారెడ్డిలో కెసిఆర్ ప్రభంజనం

- Advertisement -
- Advertisement -

ఆయనకే మద్దతు అంటూ 13 కుల సంఘాల తీర్మానాలు

మనతెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి ని యోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభం జనం కొనసాగుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సిఎం కెసిఆర్‌కు మద్దతుగా పలు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌కే ఓటు వేస్తామని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని కుల సంఘాలు తీర్మానం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎమ్) గ్రామం లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మద్దతుగా 13 కుల సంఘాలు తీర్మానాలు చేశాయి. తీర్మా నాల కాపీలను స్థానిక ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్, గంప గోవర్ధన్‌కు కుల సంఘాల నేతలు అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News