Thursday, December 26, 2024

75 ఏళ్లు గడిచినా.. సమస్యలు పరిష్కారం కాలే

- Advertisement -
- Advertisement -

మనదేశ ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి ఇంకా రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి గుణగణాలతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని కెసిఆర్ కోరారు. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తోందో గమనించి ఓటు వేయాలని సూచించారు. భారాస పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. ఉన్న తెలంగాణను ఒకప్పుడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందని నిప్పులు చెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News