తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు.
ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.. పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మూడు జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించాను. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని రైలుతు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కోసం మా ప్రభుత్వంలో చేయాల్సినవన్నీ చేశాం. వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ.. మూడు నెలల్లోనే ఎలా దిగజారిపోయింది?. కెఆర్ఎంబి ఎవడూ.. అయనేమన్న సూపర్ బాసా?. నేడు నాగార్జున సాగర్ కట్టపైకి వెల్లే పరిస్థితి ఉందా?. మా ప్రభుత్వంలో ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదు. ఇప్పుడు సాగర్ కింద లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. సూర్యాపేటల్ 20వేల ఎకరాలు ఎండిపోయాయి. 100 రోజుల్లో 200మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అసమర్థ ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి వచ్చింది. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాల్సిందే” అని అన్నారు.