Tuesday, April 8, 2025

కెసిఆర్ ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి….

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి: తెలంగాణకు సిఎం కెసిఆర్ శ్రీరామరక్ష అని బలంగా జనం నమ్ముతున్నారు. కెసిఆర్ చేతిల్లోనే తెలంగాణ సురక్షితం, సుభిక్షమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ పార్టీ దూసుకపోతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిఎం కెసిఆర్ ఆశీర్వాద సభలు ఉన్నాయి. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి. కోదాడ, తిరుమలగిరి, ఆలేరు పట్టణాలు గులాబీమయంగా మారాయి. సిఎం కెసిఆర్ రాక కోసం నల్లగొండ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిఎం కెసిఆర్ ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. కాంగ్రెస్ కుట్రలను గులాబీ దళపతి కెసిఆర్ చీల్చి చెండాడుతున్నారు. సిఎం చెబుతున్న విషయాలను ప్రజలు పూర్తిగా వినడంతో పాటు ఏకీభవిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రచారం పల్లెల్లో జోరుగా సాగుతోంది. బిఆర్‌ఎస్ 16 హామీలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News