Wednesday, November 13, 2024

ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కెసిఆర్ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హరితహారం గురించి గుర్తు చేసుకుంటు అటవీ దినోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురువారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కెసిఆర్ అని, తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని వెల్లడించారు.

15 వేల నర్సరీల పెంపకం మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయంగా సాగిందని, వీటితో గ్రీన్ కవర్ 8 శాతం పెరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు, సకల జీవరాశులను సంరక్షించడమన్నారు. హరితహా రంలో భాగంగా నాటిన మొక్కలను, బిఆర్‌ఎస్ హయాంలో అభివృద్ది చేసిన పార్కుల ఫోటోలను ట్వీట్‌కు కెటిఆర్ జత చేశారు.

Greenery 2

Greenery 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News