భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఆదివారం కెసిఆర్ కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేశామన్నారు.
కాంగ్రెస్ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని వెల్లడించారు. నాయకులు గెలుపు, ఓటములను పట్టించుకోకూడదని కెసిఆర్ సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా తాను కష్టపడ్డానని తెలిపారు. రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. గతంలో దళారులు లేకుండా వరి కొనుగోలు చేశాం.. రంగు వచ్చిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని గుర్తుచేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయని కెసిఆర్ తెలిపారు.