Thursday, December 19, 2024

తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది : మాజీ సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఆదివారం కెసిఆర్ కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని.. ఇంకా ఉందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలేఉందన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కెసిఆర్ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా.. మధ్యలో వచ్చినా బిఆర్ఎస్ దే గెలుపు అని కెసిఆర్ జోస్యం చేప్పారు. నాలుగు నెలల్లోనే తెలంగాణ అంతా తారుమారు అయిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజిఎంలో కరెంటు కోతతో పసిపిల్లలు ఇబ్బందిపడుతున్నారన్న వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గోదావరి తీసుకెళ్లి కర్నాటక, తమిళనాడుకు ఇస్తామని మోడీ అంటున్నారు. గోదావరి జలాలపై రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడట్లేదని కెసిఆర్ మండిపడ్డారు. తాను సిఎంగా ఉన్నప్పుడే మోడీ గోదావరిపై ప్రతిపాదన పంపారని చెప్పారు. ముందు తెలంగాణ వాటా తేల్చాకే మీటింగ్ కు వస్తానని మోడీకి తేల్చిచెప్పానని స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు గెలుపు, ఓటములను పట్టించుకోకూడదని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా తాను కష్టపడ్డానన్నారు. రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. గతంలో దళారులు లేకుండా, రంగు వచ్చిన వరి ధాన్యం కూడా కొనుగోలు చేశామని గుర్తుచేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News