హైదరాబాద్: దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కెసిఆర్ కేంద్రాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోడీ ప్రభుత్వం ఎందుకు జనాభా గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏమిటీ? అని నిలదీశారు. ‘140 సంవత్సరాలుగా ఏ ఒక్కసారి జనాభా గణన ఆగలేదు. రెండుసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినా జనాభా గణన ఆపలేదు. దానికి ఉండే ప్రాధాన్యం దృష్ట్యా గణన ఆపలేదు. గణన జరిగితే ఇండ్లు ఎవరికి ఉన్నాయ్.. దేశం పరిస్థితి, ప్రజల పరిస్థితి తెలుస్తుంది. గణన చేపడితే మా బండారం బయటపడుతుందని జరుపడం లేదు. కుల గణన చేపట్టాలని బీసీ కులాలు అడుగుతున్నయ్.. ఎందుకు లెక్కించడం లేదు. ఎస్సీలు 15శాతం అని చెప్పారు.. అది ఇప్పుడు 16.50శాతం నుంచి 17 శాతాన్ని మించిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 19శాతం దాటిపోయింది. జనాభా గణన లేకుండా ఏ దేశమైనా పరిపాలన చేస్తుందా? ప్రణాళికాబద్ధమైన పరిపాలన జరగాలంటే జనగణన తప్పనిసరి. చీకట్లోకి మోడీ ప్రభుత్వం బాణం కొడుతుంది మోడీ ప్రభుత్వం. మేం చెప్పిందే లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేనా భారతదేశాన్ని నడిపే పద్ధతి? దీనిపై ప్రజలు ఆలోచించాలి’ అన్నారు.
జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు : ప్రధానిని ప్రశ్నించిన సీఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -